పలమనేరు: పాతపేట సూరప్ప వీధిలో ఆపద్బాంధవ వినాయక భక్త మండలి సభ్యులు తెలిపిన సమాచారం మేరకు. ప్రతి ఏటా వినాయక చవితి పండుగకు మట్టి గణనాధుని ప్రతిమ ఏర్పాటు చేసి 11రోజుల పాటూ వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అలంకరణలో భాగంగా ఆపద్బాంధవ వినాయక భక్తమండలి సభ్యుల తరఫున 8లక్షల కరెన్సీ నోట్లు మరియు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశామన్నారు. సభ్యులు మురళి మాట్లాడుతూ, పలమనేరులో ఇప్పటివరకు 60% మట్టి గణపతి విగ్రహాలనే వాడుతున్నారు, మిగిలిన 40% మట్టి వినాయక విగ్రహాలు వాడాలన్నారు.