సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు డివిజన్ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అంగవైకల్యాన్ని బట్టి పరికరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఐఈఆర్డి జిల్లా కోఆర్డినేటర్ ఎర్రం శెట్టి రాంబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యతో పాటు అంగవైకల్యం నుండి బయటపడేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. సర్వ శిక్ష అభియాన్, అలింకో కాన్పూర్ సహకారంతో ఈ పరికరాలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం తదితరులు పాల్గొన్నారు.