నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసాలకు గురి చేస్తున్న పర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కడెం మండలం పెద్దూరు తాండ రైతు మోహన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల వ్యవసాయ అధికారి దినేష్ కు వినతి పత్రం అందజేసి వారు మాట్లాడారు కడెం మండల కేంద్రానికి చెందిన ఓ పార్టీ లేజర్ నిర్వాహకుడు ఇచ్చిన విత్తనాలను తీసుకువెళ్లి పొలంలో నారు అలకగా వరి పంట ఏపుగా ఎదిగింది కానీ వడ్ల గోల వేయకపోవడంతో రైతు అవాక్కై నకిలీ విత్తనాలు ఇచ్చారని గుర్తించానన్నారు. వెంటనే నకిలీ విత్తనాల పట్ల విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.