వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాచలం పట్టణంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలో లాడ్జిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రభ అనే వ్యక్తి రామాలయం సమీపంలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..