గణేష్ నిమజ్జనాలను ప్రశాంతమైన ధార్మిక వాతావరణం లో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం అన్నారు. రేపు కరీంనగర్ లో జరగబోయే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మానకొండూర్, చింతకుంట చెరువుల వద్ద అధికారులతో కలిసి పరిశీలించారు. గణేష్ ఉత్సవాలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. శానిటేషన్ విద్యుత్, మంచినీటి సౌకర్యం, గజ ఈతగాళ్ళ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.