రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం శంకుస్థాపన చేయడం జరుగుతుందని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు,రాజన్న భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.రోడ్డు వెడల్పులో స్థలాలు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం మరువలేనిదని అన్నారు.