తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలో సీపీఎం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి సీపీఎం డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. ఐలమ్మ తెగువ మహిళా లోకానికి ఆదర్శం అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని ఆయన తెలిపారు.