సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన పాఠశాల మన ఆత్మగౌరం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఆదివారం తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మన పాఠశాలల్లో మన ఆత్మ గౌరవాన్ని నిలబట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.