జనగామ జిల్లాలో చైన్స్ మ్యాచింగ్ కలకలం రేపింది.స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధపురంలో గురువారం సాయంత్రం పోచమ్మ టెంపుల్ సమీపంలో తన భర్తతో ఎక్సెల్ వాహనంపై యూరియా బస్తాలు తీసుకెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు.బంగారు గొలుసు లాక్కోవడంతో మహిళ ద్విచక్ర వాహనంపై నుండి కింద కింద పడి స్పృహ కోల్పోయింది.ఘటన చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నారు.