సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం అర్చకులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మూసి వేయడం జరిగిందని తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆలయంలో సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.