వినాయక నిమజ్జనం సందర్భంగా మోటుమాల సముద్రతీరంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పురిణి నాగరాజు,పురిణి పాలచందర్రావు అనే ఇద్దరు సముద్రంలో మునిగి మరణించారు.మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వారు వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో సముద్రంలో బాగా లోతుకు వెళ్లడంతో అలల తాకిడికి కొట్టుకుపోయారు. కాసేపటికే ఒడ్డుకు వారి మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.