కడప నగరపాలక పరిధిలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు.. శివారు ప్రాంతాలను రహదారి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత సులభతరం చేసేలా ప్రత్యేక చర్యలను తక్షణమే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కడప ఆర్డీవో సమావేశ మందిరంలో.. ఏర్పాటు చేసిన కడప నియోజకస్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.