నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో ఓ మహిళా ఇంటి ముందు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుడు నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన బత్తుల సైదులుగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.