ముమ్మిడివరం మండలం, అయినాపురం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టరు పై ఐరన్ మడతలు తరలిస్తుండగా యానాం కు చెందిన జట్టు కూలీ మృతి చెందాడు పల్లంకుర్రు - మురమళ్ళ ఏటిగట్టుపై అయినాపురం నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగా ట్రాక్టరు తిరగబడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని మేడిశెట్టి గోవిందు గా గుర్తించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.