చందుర్తి గ్రామానికి చెందిన కత్తి గణేష్ (25) యువకుడు గత కొన్ని ఏండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు.మంగళవారం సాయంత్రం మస్కట్ లో గణేష్ నివాసం ఉంటున్న రూమ్ లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు.ఇటీవలే ఇండియాకి వేకేషన్ పై వచ్చి తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు కంటతడి పెడుతున్నారు.చిన్న వయసులో ఉండగానే గణేష్ తల్లిదండ్రులను కోల్పోయాడు.మేనత్త,సొంత బాబాయ్ చేరదీసి గణేష్ను పెద్ద చేసి గల్ఫ్ దేశం పంపించారు. మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు అధికారులు కృషి చేయాలని బుధవారం గ్రామ ప్రజలు కోరారు.