బోధన్ మండలంలోని కందకుర్తి పరివాహరక గ్రామాలలో భారీ వర్షాల నేపథ్యంలో గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్థంబాల వద్ద పెద్దమొత్తంలో వరద నీరు నిలిపోయింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్న మొక్కవోని దీక్షతో బోధన్ విద్యుత్ శాఖ డిఇ. ఎండి. ముక్తార్, ప్రభాకర్, మారుతి, సీనియర్ లైన్ ఇన్స్ పెక్టర్లు రాజు, మురళి, కృష్ణ, లైన్మెన్ విజయ్ తమ సిబ్బందితో కలిసి తమ ప్రాణాలకు వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.