భారతదేశంలో 1975లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి యువమోర్చా జిల్లా నాయకులు బూరుగు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని రద్దుచేసి దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని, దేశంలో 21 నెలలు చీకటి రోజులుగా మిగిలిపోయాయి అన్నారు. అనేకమంది నాయకుల హత్యలకు కారణమైందని ఆరోపించారు.