వెలిగండ్ల: మోటార్ బైకును గ్యాస్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన వెలిగండ్ల మండలం రాళ్లపల్లి గ్రామం వద్ద సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాళ్లపల్లి గ్రామానికి చెందిన రవి మరో వ్యక్తితో కలిసి మోటార్ బైక్ పై వెళుతుండగా వేగంగా వచ్చిన గ్యాస్ లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అరవితోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు.