శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర జడ్పీ పాఠశాల హెచ్ఎం కుమారి చింతామణి శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.. బస్సు దిగుతుండగా పొరపాటున జారిపడి తీవ్ర గాయాల పాలయ్యారు.. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆమె మృతి చెందారు.. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు..