జిల్లా వైద్యశాఖ అధికారిని జయలక్ష్మి గురువారం పాత కొత్తగూడెంలోని యు పి హెచ్ సి ని అకస్మికంగా తనిఖీ చేశారు. యూపీహెచ్సీలో అందుతున్న ఆరోగ్య సేవలు గురించి డాక్టర్ రాజేష్ ని అడిగి తెలుసుకున్నారు..OP,IP సేవలు, అత్యవసరం మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు.. ల్యాబ్ లో చేస్తున్న పరీక్షలు గర్భిణీల నమోదు గర్భిణీల సేవలపై ఆరా తీశారు.. అర్హులైన పిల్లలకు మరియు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.. అనంతరం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులతో ప్రసూతి మరణాలపై విజయలక్ష్మి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు...