నారాయణపేట జిల్లా కోత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 22 నుండి జరిగే గిరిజనుల ఆరాధ్య దైవం బావోజి జాతర మహోత్సవాలకు ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.హైదరాబాద్ నుండి మద్దూర్ మండల కేంద్రంలోని గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ కు హెలిప్యాడ్ ద్వార చేరుకోనున్నారు .అక్కడి నుండి రోడ్డు మార్గాన జాతర మహోత్సవాలకు చేరుకోని దర్శించుకుంటారు .కావున తీసుకోవల్సిన భద్రత ఏర్పాట్లపై , జాగ్రత్తలపై ఆయన సంభందిత అధికారులకు దిశానిర్దేశం చేశారు .