బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసన మార్గ నిర్దేశంలో, రాష్ట్రవ్యాప్త మహిళా నేతలందరూ, జయశ్రీ నాయకత్వంలో శనివారం విశాఖ ద్వారకా బస్ స్టేషన్ ఎదురుగావున్న గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్షా కార్యక్రమం ద్వారా, ఆ మేరకు నిరసన తెలియజేశారు.కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.