అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి లోటు లేకుండా సహాయం చేస్తోందని తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 16వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం చెక్కులు, ఎల్ఎసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు లబ్ధిదారులకు రూ. 12,01,377ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.