ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో లైసెన్స్ కలిగి ఉండాలని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్ర అన్నారు. గుంటూరు చుట్టుగుంట వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్సు కలిగి ఉండాలని, ఆర్ సి బుక్ను తీసుకొని రావాలన్నారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న ఎవ్వరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను పాటించాలన్నారు. 11 వాహనదారులకు అపరాధ డ్రెస్ విధించినట్లుగా ఎస్సై వివరించారు.