అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి నేసే విధి ప్రజలు, యువతులు, మహిళలు సారెను సమర్పించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా నేసే విధి నుంచి అమ్మవారికి సారే సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం నేసే విధికి చెందిన యువతులు, మహిళలు కోలాటం ఆడుతూ సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నేసే విధి వారు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.