సబ్సిడీతో వచ్చే బోట్లను మత్స్యకారులు తీసుకుని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ రాం శంకర్ నాయక్ లతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. సముద్రాన్ని నమ్ముకొన్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.