సిపిఐ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి అకాల మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో సుధాకర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఎదురిస్తూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే సమస్యల పరిష్కారానికి పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆనాడు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.