గత కొంతకాలంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రకాష్ రెడ్డి గతంలో యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ధర్మవరంలో తన కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేతిరెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించలేదని పరిటాల శ్రీరామ్ను వ్యతిరేకించడం లేదంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల గురించి కేతిరెడ్డిని మంగళవారం ప్రశ్నించగా కార్యాలయాలు పెట్టడం అటు ఉంచి ఫోన్ ఎత్తి సమాధానాలు చెప్తే సరిపోతుంది కార్యాలయాల వరకు ఎందుకులే అంటూ వెళ్లిపోయాడు.