నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాలేశ్వరంపై నిందలు వేస్తుందన్నారు. ఎన్నికలు ఉన్నాయంటే చాలు కాలేశ్వరాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. సిబిఐ దర్యాప్తు వెనుక రేవంత్, చంద్రబాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బిజెపి ఒకటి కాకుంటే సీబీఐకి ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు.