కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ నుండి కోర్టు శేషగిరి మీదుగా హింసంద్రాపురం వెళ్లే రోడ్డు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మరమ్మతులకు గురైందని అధికారులు పట్టించుకోవడంలేదని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు జిల్లా కలెక్టర్, కొత్తగూడెం శాసనసభ్యులు,సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు పలు శాఖల అధికారులకు ఈనెల 29వ తారీఖున జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ముందు హాజరుకావాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ గురువారం నాడు నోటీసులు జారీ చేశారు..