రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో వనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచాల మండలంలోని నోముల గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కుమార్ (30) గ్రామంలోని తిరుమల ఆయిల్ మిల్లులో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడగా భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో మనస్తత్వం చెందిన కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.