సత్యసాయి జిల్లా పట్నం ఎస్ఐ రాజశేఖర్ పై గుత్తి పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. గుత్తి ఆర్ఎస్ కు చెందిన ఓ మహిళ తనను లైంగికంగా ఎస్ఐ రాజశేఖర్ వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదు చేసింది. విచారించిన సీఐ వెంకటేశ్వర్లు సర్వీసు నుండి రిమూవ్ అయిన పట్నం ఎస్సై రాజశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు, విచారణ చేపట్టారు.