మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం మున్సూర్పల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం . రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు గండీడ్ మండల వాసి రవీందర్, వికారాబాద్ వాసి రవినాయక్గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.