Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
కావలి ఏఎంసీ ఛైర్మన్గా పోతుగంటి అలేఖ్య నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో శనివారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించారు. తనమీద నమ్మకంతో ఛైర్మెన్ బాధ్యతలు అప్పజెప్పిన ఎమ్మెల్యేకు అలేఖ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.