పటాన్చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29, సోమవారం రోజున, దసరా పండుగను అక్టోబర్ 2, గురువారం నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శనివారం శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో జరిగిన ఈ సమావేశంలో పండుగలు ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేట్టు కుమార్ యాదవ్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.