నందిగామ మండలంలోని అంబారుపేట సత్యమ్మతల్లి జాతర మంగళవారం వుదయం 11గంటల ప్రాంతంలో ఘనంగా జరిగాయి...అమ్మవారిని నూతన వస్త్రాలు, నిమ్మకాయల దండ లతో అలంకరణ చేశారు. అర్చకుడు వెంకటసుబ్బా రావు కుంకుమార్చనలు చేశారు. రఘునాథశర్మ చండీ సహిత రుద్రహోమం, గణపతి హోమం నిర్వహిం చారు. అలాగే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు.... ఈవో పామర్తి సీతారా మయ్య ఉత్సవాలను పర్యవేక్షించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు