రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సెప్టెంబర్ 2 వతేదీన జిల్లాలో పర్యటించనున్నారు.సికె దిన్నె జమాలపల్లి గ్రామం నందు సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం పెండ్లిమర్రిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సి కె దీన్ని మండలంలో బుగ్గేటి పల్లి గ్రామంలో పార్టీ క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 7:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు.