భారీగా వినాయక నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం బీచ్ ను జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు.అక్కడ చేసిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇంకా చేయవలసిన ఏర్పాట్ల గురించి స్థానిక పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.అలాగే గజ ఈతగాళ్లు, స్థానికులకు ఎస్పీ జాగ్రత్తలు చెప్పారు. నిమజ్జనాల సందర్భంగా ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితులు తను స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు