చండ్రుగొండ మండలంలోని విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రాణాలకు తెగించి గురువారం విద్యుత్ను పునర్దించారు. మద్దుకూరు ప్రాజెక్ట్ లో విద్యుత్ సమస్య అని తెలియడంతో ప్రాజెక్టులోకి సుమారు 150 మీటర్లు ఈదుకుంటూ 33 కె ఇన్సులేటర్ను మార్చి అమర్చారు. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించడంతో గ్రామస్తులు అధికారులు విద్యుత్ శాఖ వర్కర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ నితిన్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ తులసయ్య, లైన్మెన్ సతీష్, ఎఎల్ఎం జీవన్, హెల్పర్ ప్రసాద్ తన్నీరు పాల్గొన్నారు.