సిద్దిపేట జిల్లాలో ప్రజలందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. పోలీసు, మున్సిపల్, విద్యుత్ అధికారులకు వినాయక మండపాల నిర్వాహకులు సహకరించాలని తెలిపారు. చెరువులు, కుంటలు నిండి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.