మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం తండాకు చెందిన బానోతు చక్ర (44) అనే రైతు సోమవారం మధ్యాహ్నం 3:00 లకు తన వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా తాచుపాము కాటుకు గురయ్యాడు..పత్తి చేనులో నీళ్ల పైపులు సరిచేస్తుండగా పాము కాటు వేయడంతో, చికిత్స నిమిత్తం కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లారు..మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. బానోతు చక్ర మృతితో తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.