హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధిలో మార్పు కనిపించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ కు చరిత్రాత్మక ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ చెరువు కి సంబంధించి అభివృద్ధి హుస్నాబాద్ నియోజకవర్గంలో, హుస్నాబాద్ మున్సిపాలిటీ లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. రూ.15 కోట్లతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎల్లమ్మ చెరువుకి కాకతీయుల