శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని బాలంపల్లి పంచాయతీలో అధికారులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పల్లె బాట కార్యక్రమం నిర్వహించారు. ప్రథమంగా గ్రామంలో ఉన్న పల్లు రకాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా నియోజకవర్గము గురించి ఆలోచిస్తారని, ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమ