అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఊబిచెర్ల నుంచి గుత్తి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ..సేవ్ అనంత అనే నినాదంతో మహా పాదయాత్ర నిర్వహించారు. గుత్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు ఆర్డీటీని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు సాకే గోవిందు, ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్, బీఎస్పీ నాయకుడు బండల రామాంజనేయులు మాట్లాడుతూ ఆర్డీటీ సేవలను యథావిధంగా కొనసాగించి పేదలకు న్యాయం చేయాలన్నారు.