మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రు సెంటర్ లో శుక్రవారం సాయంత్రం 7:00 లకు దారుణం చోటు చేసుకుంది.. నడి రోడ్డు పై పడుకున్న ఆవు ను కారు ఢీ కొట్టింది.. కారు ఢీ కొట్టడం తో ఆవు అక్కడిక్కడే మృతి చెందింది..స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి సీఐ మహేందర్ రెడ్డి తన సిబ్బంది తో చేరుకొని విచారణ చేపట్టారు..కారు యజమానిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు..యజమాని పై చర్యలు తీసుకోవాలంటూ గోవు రక్షణ కమిటీ పోలీస్ లను డిమాండ్ చేశారు..