గుంటూరు నగరంలలోని రిజిస్టర్ ఆఫీస్ ముందు డాక్యుమెంట్ రైటర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా డాక్యుమెంట్లు రాసుకుంటూ జీవిస్తున్న సుమారు 30 మందిని మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఫుట్పాత్, ఆఫీస్ బయట ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారని, దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.