నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టుకు 117 ఏండ్ల నిండాయి. నిజాం కాలంలో 1908లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆదివారం ప్రాజెక్టు వివరాలు తెలిసిన ప్రకారం ఆనాటి నవాబు షాహలి అనే ముస్లిం సోదరుల పేర్లలో గౌరమ్మ పేరు మిలితం చేయడంతో షా అలీ గౌరమ్మ అని అది క్రమమైన శాలిగౌరారం గా మారిందని పూర్వీకులు చెబుతున్నారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 5 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండు జలకళను సంతరించుకుని ఉంది.