బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో కలువ పూల కోసం చెరువులోకి వెళ్లి మునిగి మృతి చెందిన సైకం నాగభూషణం, సుద్ధపల్లి శ్రీమంత్ అనే ఇద్దరు విద్యార్థుల ఘటనపై బుధవారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. వినాయక చవితి పందిరి డెకరేషన్ కోసం కలువ పూల కోసం విద్యార్థులు వెళ్లి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.