వికారాబాద్ జిల్లా లో పలు మండలాలలో గత కొన్ని రోజులుగా పొడి వాతావరణం నెలకొని రైతులు వర్షం కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది, కానీ అందులోని ఈరోజు గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసింది. దీంతో పంట పొలాన్ని చెరువులను తలపిస్తూ దిక్కుతోచని స్థితిలో రైతన్నలు దిగాలుగా ఉన్నారు. ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో రైతులు సతమవుతావుతున్నారు. ఇది వర్షాకాలమా లేదా ఇంకా ఏదైనా కాలమా అన్నట్టు కురిసిన రెండు గంటల్లోనే పంట పొలాలు చెరువులుగా మారిపోయాయి.