ధర్మవరం టీడీపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ గురువారం సచివాలయ శానిటేషన్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ ఇటీవల మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో ఎక్కువగా శానిటేషన్ సమస్యల గురించి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చారని అన్నాడు. కావున ఉద్యోగులు ధర్మవరం పట్టణంలో శానిటేషన్ సమస్య లేకుండా చూసి పరిశుభ్రత ఉండేటట్లు చూడాలన్నారు.